Sunday, 26 July 2026 10:03:35 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26

Date : 26 February 2026 07:30 PM Views : 293

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లి -ఫిబ్రవరి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ఎపిక్స్-2K26 (ఎపిచ్స్-2026) ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ యాశ్పాల్, సీనియర్ మేనేజర్, ఏ.టి&టి కంపెనీ, బెంగళూరు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల పెరుగుదల, డేటా భద్రత, ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి అని అన్నారు. నకిలీ ఈమెయిల్లు, బ్యాంక్ లేదా కంపెనీల పేరుతో వచ్చే లింకులు ద్వారా వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు దొంగిలించడం జరుగుతోంది. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రజల ఖాతాల నుంచి డబ్బును ఊహించలేని విధంగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఆధునిక సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాకుండా ప్రముఖుల్నీ సైతం మోసం చేస్తున్న అనేక ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైబర్ భద్రతపై విస్తృత అవగాహన అవసరమని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం రక్షణ, పాస్‌వర్డ్ భద్రత, రెండు-దశల ధృవీకరణ, సురక్షిత బ్రౌజింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న ఉద్యోగావకాశాలు, ఎథికల్ హ్యాకింగ్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ భద్రతకు ఉన్న అవసరం మరింత పెరుగుతోందని, పరిశ్రమ అవసరాలకు తగినట్లు విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యకమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ బి.పెరిసిస్ అర్బన, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్స్ డాక్టర్ సచికంఠ దాస్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ రోని దాస్, శ్రీ లక్ష్మి ప్రీతీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :