నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో మెగా ఆటో లివ్ క్యాంపస్ డ్రైవ్ 22 విద్యార్థులు ఎంపిక అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో బుధవారం (26-11-2025) ఆటో లివ్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రస్తుతం కార్పొరేట్ కు దీటుగా తమ సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ ను పెంచుకోవాలని, కళాశాలకు టాప్ కంపెనీలు వస్తాయని వాటికీ దీటుగా ఇంటర్వూస్ లో తమ నైపుణ్యలను చక్కగా ఉప యోగించుకొని అధిక ప్యాకేజి స్థాయి కి ఎదగాలని తెలిపారు. ఇంకా ఇలాంటి కంపెనీ లు ఎన్నో వస్తాయని తెలిపారు. ప్లేసెమెంట్ ఆఫీసర్ జె. రవికుమార్ మాట్లాడుతూ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 22మంది ని ఎంపిక చేసారని, అందులో ఈ ఈ ఈ డిపార్ట్మెంట్ నుండి 13 మరియు ఈ సి ఈ డిపార్ట్మెంట్ నుండి 9 మంది ఎంపిక అయినారని వీరికి అధిక ప్యాకేజీ 2.6 లక్షల వరకు ఉంటుందని, ఎంపికైన విద్యార్థులు సూపెర్వైజర్స్ గా ఉంటారని తెలిపారు. విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు ఇలాంటి ఉన్నత స్థాయి లో జరిగే ఉద్యోగ నియామకాలు ద్వారా విద్యార్థులు తమ జీవితాలు కు పూల బాటలు వేసుకోవచ్చని, విశ్వం కాలేజీ లో క్యాంపస్ ఇంటర్వూస్ ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, ప్లేసెమెంట్ ఆఫీసర్ జె. రవి కుమార్, హెస్. ఓ. డీస్, డీన్స్, అధ్యాపకులు, మరియు బి. టెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News