నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : రామసముద్రం మండలంలోని చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతినీ పరిష్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు డి నాగరత్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది .శ్రీనివాస రామానుజన్ యొక్క జీవిత చరిత్ర మరియు ఆయన జీవితంలోని స్ఫూర్తిదాయక సంఘటనలు విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులకు క్విజ్ పోటీలు, రంగవల్లి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమనకు గణిత ఉపాధ్యాయులు నాగవేణి, ఈశ్వరరావు, లక్ష్మీనారాయణ, రవికుమార్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరవడం జరిగింది
Admin
Namitha News