Monday, 27 July 2026 04:22:55 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచి తీరాలి - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 22 April 2026 09:00 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 22 : తంబళ్లపల్లె మండలంలో జరిగే ఉపాధి హామీ పనులలో పనిచేసే కూలీల సంఖ్య వెంటనే పెంచాలని జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష జరిపారు. క్షేత్ర సహాయకులు ప్రతి గ్రామంలోని పర్యటించి జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి పనికి వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. వి బి జి రాంజీ ఉపాధి చట్టం ద్వారా 125 రోజులు పని దినాలు పెంపు, నాలుగు గంట లు పని,వారానికే వేతనాలు చెల్లింపులు వారికి సూచనలు ఇచ్చి పనికి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జలధార కార్యక్రమంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాముల నీటి సంరక్షణ పనులు చేపట్టి భవిష్యత్తులో ప్రతినీటి బొట్టు ఓడిసిపట్టే పనులు చేపట్టాలన్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1230 పనులను మంజూరు చేశానని అందులో 547 పనులు పూర్తిగా జరగి 773 పనులు ప్రోగ్రెస్ లో ఉన్నట్లు చెప్పారు. దీంతోపాటు 12 78 కొత్త పనులకు ప్రతిపాదనలు ఇచ్చినట్టు చెప్పారు. జరగబోయే పనులు నాణ్యత లోపం లేకుండా జరిగేలా చూసి పొరపాటు జరిగితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా భవిష్యత్తులో భూగర్భ జలాలు అభివృద్ధికి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. మండలంలో 53 పనులకు గాను 1247 మంది కూలీలు పనిచేస్తున్నారని కూలీల సంఖ్య పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. గత నాలుగు మాసాలుగా పెండింగ్ ఉపాధి హామీ పనులకు నిధులు విడుదల అయ్యాయని కూలీలు ఉపాధి పనులకు రావడానికి వారిలో చైతన్యం నింపి కూలీల సంఖ్య తో పాటు పనులు వేగవంతానికి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సమీక్షలో ఏపీ డి చందన, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బావాజీ, సుజాత,పుష్పకుమారి, బాలగంగాధర్, భూదేవి, ఆపరేటర్లు రమేష్, సరస్వతి పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :