నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి డిసెంబర్ 16 : భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రం లోని 17 వైద్య కళాశాల వద్ద నిరసనకు పిలుపు నిచ్చిన మేరకు, పిపిపి విధానం ను రద్దుచేసి ప్రభుత్వ ఆధీనము లోనే అభివృద్ధి చేసి ప్రభుత్వం ఆదీనం లోనే కొనసాగాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న మెడికల్ కళాశాల వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ అన్నమయ్య జిల్లా పి మహేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధీనంలో 17 మెడికల్ కళాశాలలో నెలకొల్పడం జరిగిందని వాటికి సంబంధించి మదనపల్లి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు 60 శాతం పూర్తి అయినాయని మిగతా 40 శాతం పూర్తి చేసి కళాశాలను నిర్మించాల్సి ఉండగా గత ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కళాశాలలో 50 శాతం సీట్లు అమ్ముకోవచ్చని జీవో నెంబర్ 107, 108 లను రద్దు చేయాలని వీటి వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనగారిన వర్గాల రిజర్వేషన్లు, సీట్లు కోల్పోతారని సామాన్యులకు సీట్లు కొనే అవకాశం ఉండదని పేద విద్యార్థులకు వైద్య విద్య అందరిని దాక్ష పండులాగా తయారవుతుందని గగ్గోలు పెట్టి ధర్నాలు నిరసనలు చేసిన తెలుగుదేశం నాయకులు ప్రస్తుతం మెడికల్ కళాశాల లను హోల్ సేల్ గా తమకు కావలసిన కార్పొరేట్ సంస్థలకు చెందిన నారాయణ విద్యాసంస్థల లాంటి వారికి అప్పనంగా అప్పజెప్పడానికి కోరుకుంటున్నారని వీటివలన పేద మధ్యతరగతి సామాన్యులు ఉచిత వైద్యానికి దూరమవుతారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 509 ని రద్దు చేయాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నదని ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించి దీనికి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ ఆదీనం లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18 గురువారం మదనపల్లి మెడికల్ కళాశాల శానిటోరియం వద్ద జరుగు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు లౌకిక ప్రజాతంత్ర వాదులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబ శివ, శివరామకృష్ణ దేవరా, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్, ఏఐఎస్ఎఫ్ స్థానిక నాయకులు సాయికిరణ్ సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్, తిరుమల తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News