నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 25 : అంగళ్ళు సమీపం లో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు అశ్వ్ 2కె26- జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ గాయకులు సాగర్, లిప్సిక భాష్యం మరియు మౌనిక యాదవ్ లు హాజరయ్యారు. కార్యక్రమం లో ఛాన్సల్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ఇలాంటి వేడుకలు విద్యార్థుల జీవితంలో మరిచిపోలేని మంచి జ్ఞాపకాలను ఇస్తాయని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా బాలికలు ముందుకు వచ్చి మదనపల్లి మరియు సమీప జిల్లాల్లో ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల యూనివర్సిటీకి మంచి పేరు వచ్చిందని అన్నారు. 2026లో చదువు పూర్తి చేసి వెళ్లే విద్యార్థులకు ఈ వేడుకలు మంచి జ్ఞాపకంగా నిలవాలని, మొదటి సంవత్సరం విద్యార్థులు సీనియర్ల నుంచి సంప్రదాయాలు, కార్యక్రమాల నిర్వహణ నేర్చుకోవాలని సూచించారు. మిట్స్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చురుకైన క్యాంపస్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు. విద్యతో పాటు వినోదం, స్నేహాలు కూడా ముఖ్యమని, కలిసి పనిచేయడం మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని అన్నారు సింగర్స్ పాడిన పాటలు విద్యార్థులను అలరించాయి. అశ్వ్ కార్యక్రమం సందర్బంగా “రకాసా” సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. కార్యక్రమంలో కొణెదల నిహారిక, హీరో సంగీత శోభన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ మానస శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, గెటప్ శీను చిత్ర బృందం ట్రైలర్‌ను ఆవిష్కరించి, సినిమా విశేషాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, “రకాసా” సినిమా యూత్‌కు ఆకట్టుకునే విధంగా యాక్షన్, ఎమోషన్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబడిందని తెలిపారు. విద్యార్థులు కూడా ట్రైలర్‌ను ఆసక్తిగా వీక్షించి, హర్షధ్వానాలతో అభినందించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ నాదెళ్ల ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ కమల్ బాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక, డ్యాన్స్ మరియు ఇతర కార్యక్రమాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి
Reporter
Namitha News