నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు, జూలై 1: అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని భాష్యం స్కూల్‌లో డాక్టర్స్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యుడు డాక్టర్ పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి లేదా అస్వస్థతకు గురైన వారికి ప్రథమ చికిత్స ఎలా అందించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శించి వివరించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పోషకాహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఆటలు ఆడడం, యోగా సాధన చేయడం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ పవన్‌ను పాఠశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపల్ మౌనికతో పాటు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు డాక్టర్ పవన్ ను అభినందించారు.
Reporter
Namitha News