నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 26 : తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ కు టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి కోసువారిపల్లి వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ టీటీడీ కి చెందిన డైరీ తోపాటు నూతన సంవత్సర క్యాలెండర్ను బహుకరించారు. శుక్రవారం టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి మండలంలో అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి సహకరించాలన్నారు. ఎస్సై వారిని అభినందించి మండలంలో నేర రహిత సమాజానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, పురుషోత్తం,మాజీ జడ్పిటిసి రామచంద్ర, క్లస్టర్ ఇంచార్జ్ లు బేరి శ్రీనివాసులు, కాలా నారాయణ,తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, సోమశేఖర్,బురుజు వెంకటరమణ,మాజీ సర్పంచ్ సుధాకర్, జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News