Sunday, 26 July 2026 10:46:19 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎయిడ్స్ రహిత జిల్లాగా అన్నమయ్యను తీర్చిదిద్దుదాం

మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Date : 07 May 2026 02:34 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పిలుపునిచ్చారు. గురువారం మదనపల్లిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమానికి సంబంధించిన అవగాహన కరపత్రాలను సంయుక్త కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., జిల్లాలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సంబంధిత వైద్య సేవా కేంద్రాలు, సమీకృత సలహా మరియు పరీక్షా కేంద్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించడంతో పాటు, హెచ్ఐవి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన పరీక్షా సామగ్రి, మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని, సమిష్టి కృషితో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ మరియు కుష్టు నివారణ అధికారి డాక్టర్ రాధిక, కార్యక్రమ సమన్వయ అధికారి వి. భాస్కర్, జిల్లా సహకారశాఖ అధికారి త్యాగరాజు, వ్యవసాయ శాఖ జేడి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :