నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 08 : పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పట్టణంలోని ముడెప్ప సర్కిల్‌లో గల మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టనున్న బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా ప్రజల్లో అవగాహన కల్పించడమే రిలే నిరాహార దీక్ష లక్ష్యమని తెలిపారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో భూముల కేటాయింపు, కులాల కార్పొరేషన్లకు నిధుల పెంపు, సమగ్ర కుల గణన, 44 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్ సాంబమూర్తి గిరిబాబు, వెంకటేష్ యాదవ్, స్వాతి ప్రసాద్, శంకర, గంగరాజు, చలపతి, నాగరాజు, గణేష్, జ్ఞానేంద్ర తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News