Sunday, 26 July 2026 10:33:01 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కృత్రిమమేధస్సు, నూతన ఆవిష్కరణల మోడల్స్ పై ప్రోటోథాన్-2026 హ్యకథాన్

Date : 18 February 2026 08:09 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 18 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు మిట్స్ ఐ.ఐ.సి. వారి ఆధ్వర్యంలో కృత్రిమమేధస్సు మరియు నూతన ఆవిష్కరణలకు సంబంధించిన మోడల్స్ పై ప్రోటోథాన్-2026 హ్యకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బెంగుళూరు కు చెందిన ఎల్.టి.ఐ కంపెనీ నందు ప్రాజెక్ట్ లీడ్ గా పనిచేస్తున్న బావాజీ దొరగింటి మరియు కెల్లనోవా సంస్థ నందు రెవిన్యూ గ్రోత్ మేనేజిమెంట్ విభాగానికి చెందిన జయశ్రీ పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో బావాజీ దొరగింటి మాట్లాడుతూ నూతన టెక్నాలజీ పై ఆవిష్కారణలు చేయాలనీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు చిన్న చిన్న సంస్థలు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీ లో మెరుగైన పరిశోధనలతో నూతన ఆవిష్కరణలను చేస్తున్నాయని విద్యార్థులు వాటి పై ద్రుష్టి పెట్టాలని అన్నారు. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న వేగవంతమైన పురోగతి వెనుక సాంకేతికతలో ఆవిష్కరణలు, పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం మొదలైనవి సాంకేతిక ఆవిష్కరణ పురోగతికి మూలస్తంభంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక ఆవిష్కరణ అనేది సామర్థ్యాన్ని పెంచి, సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త అవకాశాలను సృష్టించేదని అన్నారు. సంచలనాత్మక ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే ఉన్న సాధనాలు, సిస్టమ్‌లు మరియు ప్రక్రియలకు పెరుగుతున్న మెరుగుదలలను టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. మన ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన నాణ్యత, పర్యావరణ సుస్థిరత మొదలైన వాటి పై ప్రభావితం ఉంటుందని అన్నారు. టెక్నాలజీ ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక శక్తి, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) మొదలైన రంగాలలో ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు వాటి పై ద్రుష్టి పెట్టాలని అన్నారు. ప్రయోగాలు చేయడానికి మరియు సృష్టించడానికి విద్యార్థులకు జ్ఞానం, సాధనాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లను అందించడం లో మరియు ఆవిష్కరణలను పెంపొందించడంలో మిట్స్ విద్యా సంస్థ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నదని, ఇలాంటి హ్యాకథాన్‌లు, పరిశోధన కార్యక్రమాలు టెక్నాలజీ పరంగా విద్యార్థులను శక్తివంతం చేస్తాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోటోథాన్‌ లో స్మార్ట్ ఎడ్యుకేషన్ & ఎడ్‌టెక్, స్మార్ట్ హెల్త్‌కేర్ & వెల్‌బీయింగ్, స్మార్ట్ సిటీస్ & అర్బన్ ఇన్నోవేషన్, అగ్రికల్చర్ & రూరల్ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ 4.0 & ఆటోమేషన్, సస్టైనబిలిటీ & క్లైమేట్ యాక్షన్ వంటి ఆరు ప్రధాన అంశాలపై పోటీలు నిర్వహించబడగా, పరిమిత కాలవ్యవధిలో విద్యార్థులు సృజనాత్మకత, జట్టు భావం, సమస్య పరిష్కార నైపుణ్యం మరియు సాంకేతిక ప్రావీణ్యాన్ని ప్రతిబింబించే వినూత్న ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేసి తమ ప్రతిభను చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు

ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పనా , ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కే చోకనాథన్, కో కోఆర్డినేటర్ టి పవన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :