నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె- జూలై 08 : ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై ఇంటిలోని సామాను పూర్తిగా అగ్నికి ఆహుతి అయినా సంఘటన కోసువారిపల్లె పంచాయతీలో జరిగింది. పాపన్న చెరువు పల్లె కు చెందిన భాగ్యమ్మ బుధవారం ఉదయం కూలి పనులకు వెళ్ళింది. సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో సామాన్లు దగ్ధమై పొగలు రావడంతో గ్రామస్తులు ఆర్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇంటిలోని రెండు లక్షలు నగదు 10 గ్రాముల బంగారు, బియ్యం, సరుకులు,రికార్డులు, పాస్ బుక్కులు, కట్టు బట్టలు సైతం కాలి బూడిద అయ్యాయి. ఈ సంఘటనపై విద్యుత్ శాఖ ఏఈ సురేంద్ర, సిబ్బంది పర్యవేక్షించారు. అగ్నిప్రమాదంలో సర్వం కాలి బూడిదైన భాగ్యమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా అని రంగాలుగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తామని టిడిపి నాయకులు ఆదిరెడ్డి, కూటమి నాయకులు తెలిపారు
Reporter
Namitha News