నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లో నేటి నుండి పారిశుద్ధ్య పనులు నిలిపివేస్తున్నట్లు కార్మికులు అధికారులకు తెగేసి చెప్పారు. గత మూడు మాసాలుగా పరిమితికి మించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నా కార్మికులకు నేడు రేపు అంటూ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు గతవారం జీతాలు చెల్లించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో ముందస్తుగా జీతాలు చెల్లించకపోతే పనులు ఆపేస్తామని హెచ్చరించినా అధికారులు పెడచెవిన పెట్టారు. ఉదయం కార్మికులు ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ తో జీతాల విషయమై వేడుకోగా ఆయన జీతాల చెల్లింపుకు డిజిటల్ సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పడంతో వారు పస్తులతో పారిశుద్ధ్య పనులు చేయలేమని కరాకండిగా చెప్పి వెళ్లిపోయారు. పంచాయతీలో నిధులు ఉన్నా ఆరుగాలం కష్టపడే కార్మికుల జీతాలు చెల్లించకపోవడంపై స్థానిక ప్రజల సైతం అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వారికి జీతాలు చెల్లించకపోతే తంబళ్లపల్లె స్వచ్ఛ్ ఆంధ్ర దేవుడెరుగు కంపు కొట్టడం ఖాయం
Reporter
Namitha News