నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబరు 01 : తంబళ్లపల్లె మండలం కొటాల సచివాలయంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ త్యాగరాజు, ఏపీఓ అంజనప్ప ,డిఆర్పి రాజునాయక్, విఎస్ఏ నందకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉపాధి హామీలో జరిగిన 34 కరువుపనుల పై విచారణ నిర్వహించారు. గ్రామంలో కూలీలకు కల్పించిన పనుల పై రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలు ఉపాధి హామీ కరువు పనులు పెంచాలని అధికారులను కోరారు. ఈ గ్రామసభలో ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, టిడిపి నాయకులు సుధాకర్, అల్లా బక్షు, మల్లికార్జున, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Reporter
Namitha News