నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 04 : తంబళ్లపల్లె మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో వి బి జి రాంజీ ఉపాధి హామీ పథకం బలోపేతంపై జరిగే గ్రామసభలను విజయవంతం చేయాలని ఏపీవో అంజనప్ప పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండలంలోని టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రామ సభలలో గ్రామస్థాయి యాక్షన్ ప్లాన్, వికసిద్భారత్ 20 47 లక్ష్యసాధన,ప్రభుత్వం ఉపాధి హామీలో 100 నుండి 125 రోజులు పని దినాలు పెంపు, 15 రోజుల్లో ఉపాధి లేకపోతే పరిహారం చెల్లింపు, జీతాలు ఆలస్యం లేకుండా రోజువారి పరిహారం ఇంకా పలు రకాల అభివృద్ధి పనులపై చర్చ జరపాలన్నారు. ఈ గ్రామ సభలకు సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాలు, రైతులు, కూలీలు, ప్రజలు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో ఈసీ మహేష్, టిఏలు సుజాత, పుష్పకుమారి, భూదేవి,బాల గంగాధర్, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Reporter
Namitha News