నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 22 : పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కల్యాణోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి సోమవారం మాట్లాడుతూ, శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయబద్ధమైన కల్యాణోత్సవాన్ని ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారి కల్యాణ మహోత్సవం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనాలు, పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
Reporter
Namitha News