నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో ఘనంగా జరిగిన కురబల ఆత్మీయ సమావేశం - కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ మదనపల్లి : మదనపల్లెలో ఘనంగా కురబల ఆత్మీయ సమావేశం జరిగిందని కురబ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ ప్రకటించారు. బుధవారం మదనపల్లె పట్టణం, రింగు రోడ్డు నందు గల శ్రీరామ కళ్యాణ మండపంలో కురబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్యంగా పట్టణంలో శ్రీశ్రీశ్రీ శ్రేష్ఠ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడం, కనకదాస భవన నిర్మాణం, వైకుంఠ రథం ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించడం జరిగిందని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ తెలిపారు. అదే విధంగా జాతి అభివృద్ధి, బలోపేతం చేయడం కోసం కురబ సంఘం డివిజన్ కమిటీలో మార్పులు,చేర్పులపై చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కురుబ సంఘం మడికయ్యలు శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, డైరెక్టర్ చామంచుల మల్లిక,వెంకటేశ్వర స్వామి దేవాలయం మెంబర్ దుబ్బికాళ్ళ భాస్కర్, కదిరి మల్లికా రాజ్ కుమార్ లకు దుశ్యాలువతో సత్కరించి అభినందనలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వల్లిగట్ల వెంకటరమణ, DV రమణ అడ్వకేట్, కప్పల శ్రీరాములు ఎక్స్ కౌన్సిలర్, కప్పల వెంకటరమణ ఎక్స్ కౌన్సిలర్, నరసింహులు, సదాశివ, గిడే శ్రీనివాసులు, బండి రెడ్డప్ప, ఎక్స సర్పంచ్ శ్రీనివా, లక్ష్మీపతి, తిమ్మ రాయుడు, మరియు డివిజన్ పరిధిలోని కురబ సంఘం నాయకులు, కురబ కులబాంధవులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు కురవ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News