నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - మే 26 : పెద్దమండ్యం మండలం ముసలికుంట గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ జలధార పనుల్లో భాగంగా మంగళవారం ఎర్రదొడ్డి బావి కింద నల్లచెరువు కాలువ పూడిక తీత పనిచేస్తుండగా వడదెబ్బకు గురై ఆపస్మరక స్థితిలో వెళ్లగా హుటాహుటిన అక్కడి నుండి తంబళ్లపల్లి హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ వైద్యుల పరిశీలించి మరణించినట్లు తెలిపారు, మృతి చెందిన వెంకటరమణ జాబ్ కార్డు నెంబర్ 10455, వర్క్ ఐడి 35952, మాస్టర్ నెంబర్ 4002 , కావున నిరుపేద అయినటువంటి వల్లపు వెంకటరమణ తండ్రి పెద్ద హనుమంతు వయస్సు 69 సంవత్సరాలు వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఉపాధి కూలీలు మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు, వెంకటరమణ మృతికి పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి,ఏపీవో సురేంద్ర నాథ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గణేష్ తదితరులు నివాళులర్పించారు
Reporter
Namitha News