Monday, 27 July 2026 10:58:52 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్

Date : 21 April 2026 06:21 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్ కలకడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 500 హెల్మెట్ల పంపిణీ.. అవగాహన కల్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వాడకంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'యూ కాంప్లెక్స్' వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు 500 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రతి ప్రాణం ఎంతో విలువైందని, క్షణికావేశంలో, నిర్లక్ష్యంతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చలాన్ల భయంతోనో, పోలీసుల కోసమో కాకుండా.. ఇంట్లో మనకోసం ఎదురుచూసే మన కుటుంబ సభ్యుల కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖ సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని" ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న, రాయచోటి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కుళాయప్ప, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసుల రెడ్డి మరియు కలకడ పోలీసు సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: