నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 27 : తంబళ్లపల్లె మండలం ఎద్దులవారి పల్లి పంచాయతీ బస్ స్టాప్ లో మదనపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక టిడిపి సీనియర్ నేత నరసింహులు నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు నారాయణ సహకారంతో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అనిల్ కుమార్, చక్రపాణి వైద్య సిబ్బంది లు సుమారు 40 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో 25 మంది కి ఎన్టీఆర్ వైద్య సేవ సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్లు కు ఎంపిక చేసి ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుకు మదనపల్లి లైన్స్ క్లబ్ యాజమాన్యంతో పాటు టిడిపి నేతలు నరసింహులు నాయుడు, నారాయణ కూటమి నాయకులను ప్రజలు ప్రశంసించారు
Reporter
Namitha News