నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 24 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి లో వెలసిన రామాలయంలో బుధవారం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులచే స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య గోపూజ, వినాయక పూజ, సంప్రోక్షణ, జలాధివాసం, దాన్యాధివాసం, ప్రాణ ప్రతిష్ట, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు, మంగళ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుండ్లపల్లి పంచాయతీలోని వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు పొందారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి చెరువు సంఘం వైస్ ప్రెసిడెంట్ పెద్ద అపల్లa నాయుడు, మల్లికార్జున నాయుడు, రెడ్డప్ప నాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కాల నారాయణ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News