నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 26న విజయవాడలో ఏపీఐఐసీ డైరెక్టర్‌గా నా ప్రమాణ స్వీకారం - 30న మదనపల్లిలో జనసేనానికి కృతజ్ఞత ర్యాలీ - ఏపీఐఐసీ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ మైఫోర్స్ మహేష్ వెల్లడి మదనపల్లె : ఏపీఐఐసీ డైరెక్టర్‌గా 26వ తేదీన విజయవాడలో మైఫోర్స్ మహేష్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జనసేనాని,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసే నేపథ్యంలో నవంబర్ 30 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు మదనపల్లి పట్టణంలో జనసేన శ్రేణులతో భారీ “కృతజ్ఞత ర్యాలీ” నిర్వహించనున్నట్లు డాక్టర్ మైఫోర్స్ మహేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం ఎంజి గ్రాండ్స్ నందు గల జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా నాతోపాటు నడుస్తూ జనసేన కోసం కృషి చేస్తూ,నా ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఏపీఐఐసి డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రజలందరితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానన్నారు.ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబ్బు,పలుకుబడికి ప్రాధాన్యతనివ్వరని,పార్టీ కోసం నిస్వార్ధమైన సేవలందించినందుకు తనకు స్టేట్ డైరెక్టర్ పదవి అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు.అనంతరం జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర నారాయణ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ ఉదయం 10:30 గంటలకి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏపీఐఐసి కార్యాలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై,అంబేద్కర్ సర్కిల్,సీటీఎం రోడ్డు,టౌన్ బ్యాంక్ సర్కిల్,బెంగళూరు బస్టాండ్,కృష్ణదేవరాయ సర్కిల్,ఎన్టీఆర్ సర్కిల్,మార్కెట్ యార్డ్,జనసేన కార్యాలయం మీదుగా తిరిగి ఏపీఐఐసీ కార్యాలయానికి చేరుకుంటుందన్నారు.జనసేన నాయకురాలు జయ భవ్య కిషోర్ మాట్లాడుతూ అభినందన సభ ఏర్పాట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని,రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని,కుప్పం ఇన్చార్జ్ నరేష్,మైఫోర్స్ అధ్యక్షుడు ఉమేష్,పూతలపట్టు నాయకుడు స్వేరో మహేష్,రాజంపేట మహిళా నాయకురాలు రెడ్డి రాణి రాయల్ తదితరులు ఆహ్వాన కమిటీలో ఉన్నారన్నారు.ఈ కార్యక్రమ విజయానికి ఆర్గనైజింగ్,స్టేజ్ కోఆర్డినేషన్,క్యాంపెనింగ్,ఫుడ్ కమిటీలను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ మైపోర్స్ మహేష్ కి ఏపీఐఐసీ స్టేట్ డైరెక్టర్ పదవిని అప్పగించినందుకు మదనపల్లె జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.ప్రతి జనసేన కార్యకర్త,మదనపల్లి ప్రజలు,మైఫోర్స్ సభ్యులు తప్పకుండా హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.
Reporter
Namitha News