నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : శ్రీ యోగివేమన మన రాష్ట్రంలో పుట్టడం, వారి మాటలు, పద్యాలు వింటూ పెరగడం భాగ్యంగా భావించాలని డిఆర్ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు. మదనపల్లి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా పర్యాటకశాఖ వారి ఆధ్వర్యంలో ప్రజాకవి, సంఘసంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, ఏడి సర్వేయర్ భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులను డిఆర్ఓ మధుసూదన్ రావు అర్పించారు
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. యోగివేమన మన రాష్ట్రంలో పుట్టడం, వారి మాటలు, పద్యాలు వింటూ పెరగడం, భాగ్యంగా భావిస్తామన్నారు. శ్రీ యోగి వేమన పద్యాలు మారుమూల గ్రామాలలోని ప్రజలు రోజువారీ పనులు చేసేటప్పుడు, మేకలను గొర్రెలను మేపే సమయంలో, ఆవులు కడిగేటప్పుడు, పొలానికి వెళ్లేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఒకటిని ఒకరు ఉత్సాహపరిచే పద్యాలను పాడుకుంటూ గడిపే విధంగా యోగివేమన పద్యాలు ఉంటాయని తెలిపారు. దాదాపు500 సంవత్సరాల పద్యాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం,ఏడి సర్వేయర్ భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News