నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 07 : హైదరాబాద్ లో అట్టహాసంగా మిట్స్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ వారి అల్యూమినీ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి ఇండుస్త్రీలిస్ట్ కౌడిన్య పేకేటి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్, టి.జి రవికుమార్ మరియు పూర్వ విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌండిన్య మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాలేజీ నుండి చదువుతో పాటు సామాజిక సేవను సైతం నేర్పింది మిట్స్ అని, అదేవిదంగా భగవత్ గీత గురించి, అందులోని కొన్ని సూచనలు, పాటించడం వలన ఎలా ముందుకు సాగవచ్చు అనే విషయాల గురించి తెలిపారు.. మేము చదువుకునే రోజులలో అధ్యాపకులు పట్ల గౌరవం, వినయం వంటివి నేర్చుకున్నమని,ఈ రోజు ఇక్కడ ఎంతోమంది పూర్వ విద్యార్థులు, రావడం చాలా ఆనందవ గా ఉందని ఒకే లక్ష్యంతో అందరూ కలిసినప్పుడే అర్థవంతమైన పురోగతి సాధ్యమవుతుంది అని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ 1998 సంవత్సరం లో మదనపల్లి బెంగుళూరు రోడ్డు లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల అని, మదనపల్లి తో పాటు పరిసర ప్రాంతాల వారికి అనువుగా ఉండడం తో మిట్స్ ప్రస్థానం మొదలు, ఆనాటి నుండి అంచెలు అంచేలుగా ఎదిగి నేడు యూనివర్సిటీ స్థాయికి రావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. తమ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ముక్యంగా అత్యుత్తమ మల్టీనేషనల్ కంపెనీలలో వివిధ రాష్ట్రాల లో పనిచేస్తున్నారని, అంతేకాకుండా ఎంతో అత్యుత్తమ స్థానాలలో ఉన్నారని, వారి కి ఒక సమావేశాన్ని ఏర్పాటు కొరకై ఈ సమావేశాన్ని బెంగళూరు లో నిర్వహించడం జరిగినది అని అన్నారు. కార్యక్రమంలో 1998 సంవత్సరం నుండి 2025 వరకు చదివిన విద్యార్థులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ టి.జి రవి కుమార్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగ శ్వేతా, అల్యూమిని అసోసియేషన్ సెక్రటరీ భరత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యన్.విజయభాస్కర్ చౌదరి గారికి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ కృతజ్ఞతలు తెలిపారు
Reporter
Namitha News