నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు యన్.ఎస్.ఎస్ విభాగం వారి ఆధ్వర్యంలో బి.కొత్తకోట సమీపంలోని గట్టు గ్రామంలో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక క్యాంప్ లో భాగంగా దంత, కంటి ప్రత్యేక వైద్య శిబిరం మరియు పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ మొదటి రోజులో భాగంగా మదనపల్లి లోని స్కంద డెంటల్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దంత వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్కంద డెంటల్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ డాక్టర్ రెడ్డి అఖిల్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి దంత వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా అవసరం అని, చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోవాలి అని అన్నారు. రోజుకు రెండుసార్లు పళ్లు తోమడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం మంచి అలవాటు అని అన్నారు. పళ్ల సమస్యలు మొదటి దశలో నొప్పి లేకుండా ఉండవచ్చు కానీ సమయానికి పరీక్ష చేయించుకోకపోతే దంత క్షయం, మసూళ్ల వాపు, రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. క్రమం తప్పకుండా దంత పరీక్ష చేయించుకోవడం ద్వారా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సులభంగా చికిత్స చేయవచ్చు అని అన్నారు. ఇలాంటి దంత వైద్య శిబిరాలు ఆరోగ్యవంతమైన గ్రామ సమాజ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. గట్టు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో యన్.ఎస్.ఎస్ ఆఫీసర్ పి.రాజేష్, 50 మంది యెన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News