నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 17: జిల్లాలోని మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆపద సమయంలో వారికి అండగా నిలిచేందుకు ‘శక్తి’ యాప్ ఒక అద్భుతమైన ఆయుధమని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘శక్తి’ టీం బృందాలు శనివారం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆపదలో అభయహస్తం.. 10 నిమిషాల్లోనే రక్షణ! మహిళలు తమ రక్షణ గురించి భయపడాల్సిన అవసరం లేదని, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ, బాలిక 'శక్తి' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీం సభ్యులు సూచించారు. యాప్‌లోని SOS బటన్ లేదా డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే, కేవలం 10 నిమిషాల్లోనే సంబంధిత పోలీస్ అధికారులు ఆపదలో ఉన్న వారి వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు.
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు లేదా వేధింపుల ఎదురైనప్పుడు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు ????అత్యవసర సాయం: 112 ????మహిళా వేధింపులు: 1091 ????గృహ హింస: 181 ????చైల్డ్ లైన్: 1098 ????సైబర్ నేరాలు: 1930 ????సైబర్ మిత్ర లేదా స్థానిక పోలీసులను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్ నుండి 'శక్తి' యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, తమ వ్యక్తిగత వివరాలు మరియు ఫోన్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సమాజంలో మహిళల భద్రత పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిరంతరం కొనసాగుతాయని ‘శక్తి’ టీం సిబ్బంది తెలిపారు
Reporter
Namitha News