Monday, 27 July 2026 02:11:34 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ సమావేశం

Date : 11 July 2026 11:22 PM Views : 65

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గౌరవ గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తం 23 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రివర్యులకు సమర్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆలకించి, వాటిని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా నిరంతరం చర్చలు కొనసాగిస్తామని, ఉద్యోగుల సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: