నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 09 ః వేరుశెనగ విత్తన కాయలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కోసువారిపల్లి రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ వేరుశెనగ విత్తన కాయలను స్థానిక టిడిపి నాయకులు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి వైకాపా ప్రభుత్వం తంబళ్లపల్లి రైతులను అన్ని రకాలుగా మోసం చేయగా నేటి మాకూటమి ప్రభుత్వం తంబళ్లపల్లె రైతాంగానికి సకాలంలో అన్నదాత సుఖీభవ అందించడం, రైతులకు ఆధునిక, ప్రకృతి వ్యవసాయంలో మెలుకువలు,హంద్రీనీవాతో సాగునీరు, జలజీవన్ మిషన్తో ప్రతి ఇంటికి స్వచ్ఛ నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, జయరాంరెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ గంగుల్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాజారెడ్డి, ఏ ఈ ఓ రమణ కుమార్ రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News