Monday, 27 July 2026 12:10:18 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కొలువుదీరిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలకమండలి

చైర్మనుగా ప్రమాణం చేసిన నవీన్ కుమార్ చౌదరి

Date : 24 November 2025 07:42 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కొలువుదీరిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలకమండలి - చైర్మనుగా ప్రమాణం చేసిన నవీన్ కుమార్ చౌదరి - ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కృషిచేస్తా - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా స్పష్టం - పెద్దఎత్తున తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు మదనపల్లె : పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి కొలువుదీరింది.ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా ఆలయ పాలక మండలి చైర్మనుగా నవీన్ కుమార్ చౌదరి మరియు డైరెక్టర్లుగా పాలకమండలి సభ్యులు దుబ్బిగాళ్ల భాస్కర్,అజయ్ పండిట్,కె.మల్లిక,కాశీ శ్రీరామ్ వాల్మీకి,మంజునాథ్,మారుతి,ఎస్.నాగమణి,కందూరి రాజేష్,బుజ్జమ్మ,యం.ఉషలు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,పాలక మండలి చైర్మన్,డైరెక్టర్లు కుటుంబ సభ్యులు బందు మిత్రుల రాకతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు డైరెక్టర్లను పెద్దఎత్తున శాలువలు,పుష్పగుచ్చాలు,పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పాలక మండలి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ,ప్రజలకు ప్రశాంత వాతావరణంలో దర్శన భాగ్యం కలిగించే ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.అలాగే ఆలయంలో కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి వీలుగా దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి సుమారు 50 లక్షల నుండి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యే విధంగా చర్యలు తీసు కుంటామని ప్రకటించారు.అలాగే పాలకమండలి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.త్వరలోనే ఆలయం పక్కనే ఉన్న పోలీస్ స్టేషనుని ఉపయోగించుకోవడానికి త్వరలోనే మంచి నిర్ణయం తీసు కుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు.అనంతరం పాలక మండలి చైర్మన్ నవీన్ చౌదరి మాట్లాడుతూ తనకు కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకి జీవితకాలం రుణపడి ఉంటామని ప్రకటించారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా,సభ్యులు, దాతలు,పూర్వ ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డెప్ప రావుల సహకారంతో కళ్యాణ మండపం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ నవీన్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఆలయం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.కళ్యాణ మండపం నిర్మించి,పేదల వివాహాలు చేసుకునే అవకాశాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.పలువురు వక్తలు మాట్లాడుతూ పాలక మండలి చైర్మన్ నవీన్ కుమార్ చౌదరికి,డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల్లో సన్నగిల్లిన ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతోపాటు ఆలయానికి వచ్చే భక్తుల భక్తులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి,స్వామి వారి దర్శనం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ దారం అనిత,రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబు,20వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల తులసి,బొమ్మిశెట్టి పురుషోత్తం, యర్రబల్లి వెంకటరమణారెడ్డి,రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),రాటకొండ శ్రీనివాసులు నాయుడు,ముసలికుంట నాగయ్య,జనసేన దారం హరిప్రసాద్,శ్రీరామ రామాంజనేయులు,జంగాల వెంకటరమణ,రెడ్డి షంషీర్,శ్రీరామ సహదేవ నాయుడు,బాలమాలి శేఖర్,రెడ్డి రాంప్రసాద్,చల్లా నరసింహులు,డి.రమేష్ రెడ్డి,రైస్ మిల్ శశికుమార్,బిజెపి యువనాయకులు శ్రీకాంత్,రామిశెట్టి రెడ్డికేశవ,శ్రీనాథ్,వాణి దేవాదాయ శాఖ అధికారులు,స్వామివారి భక్తులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :