Sunday, 26 July 2026 06:59:07 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో అడ్వాన్సెస్ ఇన్ వైర్లెస్ కనెక్టివిటీ, టెక్నాలజీస్, సిస్టమ్స్ & నెట్‌వర్క్ ఎవల్యూషన్ పై వర్క్ షాప్

Date : 08 December 2025 10:05 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 08 : అంగళ్లు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐ.ఈ.ఈ.ఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి సహకారంతో “అడ్వాన్సెస్ ఇన్ వైర్లెస్ కనెక్టివిటీ , టెక్నాలజీస్, సిస్టమ్స్ & నెట్‌వర్క్ ఎవల్యూషన్” అనే అంశంపై మూడు రోజుల వర్కుషాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్ పద్దతిలో అంతర్జాతీయ నిపుణులు ప్రొఫెసర్ బిఘ్నరాజ్ పనిగ్రాహి (నోకియా, బెంగళూరు),ప్రొఫెసర్ పెరిక్లిస్ చట్జిమిసియాస్ (ఇంటర్నేషనల్ హెలెనిక్ యూనివర్సిటీ – గ్రీస్),ప్రొఫెసర్ కార్లో ఫిస్షియోన్ (కె.టి.ఎచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – స్వీడన్), ప్రొఫెసర్.పేయింగ్ ఝు (హువాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ – చైనా) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కనెక్టీవిటీ టెక్నాలజీల గురించి విద్యార్థులు, పరిశోధకులు మరియు పరిశ్రమ నిపుణులు అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. 5 జి , ఓపెన్ రేడియో యాక్సిస్ నెట్వర్క్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ , క్లౌడ్-నేటివ్ నెట్‌వర్కింగ్, మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్ ఫుట్ యాంటెన్నా వ్యవస్థలు, మెషిన్ టైప్ కమ్యూనికేషన్స్ వంటి విభాగాలు భవిష్యత్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో కీలకపాత్ర పోషించనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వేగవంతం అవుతున్న నేపథ్యంలో అధిక నాణ్యత గల కనెక్టివిటీ, సామర్థ్యం, భద్రత మరియు సుస్థిరతపై దృష్టిసారించే ఈ సాంకేతికతలు ప్రపంచంలో కొత్త అవకాశాలకు దారి తీస్తాయని అన్నారు. భవిష్యత్తులో 6G వంటి సాంకేతిక పరిణామాలతో వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు మనిషి–యంత్ర సంబంధాలను మరింత సులభతరం చేసి ప్రపంచాన్ని స్మార్ట్‌గా మార్చే దిశగా పరిశోధనలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు దృష్టిసారించాలని నిపుణులు తెలిపారు. కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో 150 మందికిపైగా విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డీన్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత బసు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్.రాజశేఖరన్, మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ విజయలక్ష్మి, కోర్డినేటర్స్ డాక్టర్ అరవిందరాజ్, డాక్టర్ జి.నాగాశ్వేత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: