నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 : తంబళ్లపల్లె కు సమీపంలోని పవిత్రమైన మల్లయ్య కొండలు ఆ మహా శివుడు మనకు ఇచ్చిన ప్రకృతి సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజకీయాలకతీతంగా శివ భక్తులు, రైతులు,ప్రజలు మైనింగ్ వ్యతిరేకంగా కలిసి రావాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా మల్లయ్య కొండ కింద మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ సభ్యులు, ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులు సమావేశమై మల్లయ్య కొండల మైనింగ్ చేపడితే వాతావరణ కాలుష్యం తో పాటు లక్షలాదిమంది ఆరాధ్య దైవం మల్లికార్జున స్వామి మీ ఆరాధించే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు మైనింగ్ పై పునరాలోచించి ఆపాలని ముక్తకంఠంతో నినదించారు. పాలకులు ఎవరైనా మన ప్రకృతి సంపద మల్లయ్య కొండలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములై పార్టీలకతీతంగా కలసి రావాలని సూచించారు
Reporter
Namitha News