నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో మహాశివరాత్రి కి జరిగే స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమై ప్రభుత్వం మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలు నిర్వహణకు స్వచ్ఛందంగా వేలాదిమంది భక్తులకు సేవ చేయడానికి పరస్పరం సహకరించుకోవాలన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విభేదాలు మరిచి ఐకమత్యంతో గ్రామస్థాయిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకత్వ లోపం లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని భవిష్యత్తులో పార్టీ అధిష్టానం సరైన నాయకుడిని తంబళ్లపల్లెకు ఇన్చార్జిగా పంపుతారని ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని సమస్యలు వస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కూటమి సహకారంతో మూకుమ్మడిగా సమస్యలు సాధించుకుందామని ధీమాగా చెప్పారు
Reporter
Namitha News