Sunday, 26 July 2026 12:23:20 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం - జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి

Date : 07 May 2026 02:31 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, పోరాట స్ఫూర్తి, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పేర్కొన్నారు. గురువారం మదనపల్లిలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ... తెలుగు నేలలో జన్మించి, స్వాతంత్ర్య సమరంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మహనీయుడని కొనియాడారు. అటవీ సంపదను కాపాడడం, గిరిజనులకు హక్కులపై అవగాహన కల్పించడం, వారిని చైతన్యవంతులను చేయడం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. అల్లూరి పోరాట ఫలితంగానే గిరిజన సంక్షేమం, అటవీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, అల్లూరి చూపిన సేవా మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, డ్వామా పీడీ వెంకటరత్నం, స్టెప్ అధికారి నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :