Sunday, 26 July 2026 08:20:15 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

హెచ్.సి.ఎల్ గువి తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ

Date : 05 January 2026 09:52 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం వారు చెన్నై కి చెందిన ప్రముఖ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ హెచ్.సి.ఎల్ గువి తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎస్ వినోద్, హెడ్ - ఇన్స్టిట్యూషన్ బిజినెస్, వి.లక్ష్మణ నారాయణన్, సీనియర్ మేనేజర్, హెచ్.సి.ఎల్ గువి కంపెనీ వారు, డాక్టర్ రామనాథన్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్. వినోద్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా అకడమిక్ అధ్యయనం మరియు పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ, విద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం సి.ఎస్.ఈ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, నెట్వర్క్స్ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక టూల్స్, ప్లాట్‌ఫార్మ్స్ మరియు పరిశ్రమలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై 40 రోజుల పాటు యూనివర్సిటీ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగయోగ్యత, అలాగే ఇంటర్న్‌షిప్స్ మరియు ప్లేస్‌మెంట్స్‌కు అవసరమైన సిద్ధతను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. ఈ ఒప్పందం పరిశ్రమ–విద్యా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలనే ఉద్ద్యేశంతో ఒప్పంద పత్రాలపై కంపెనీ హెడ్ ఎస్ వినోద్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో హెడ్- ట్రైనింగ్ అండ్ ప్లేసెమెంట్స్ డి.వేణుగోపాల్ చౌదరి, విభాగాధిపతులు డాక్టర్ ఎస్. పద్మ, డాక్టర్ ఆర్.కల్పనా, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, కోఆర్డినేటర్స్ డాక్టర్ ఆర్.రామ్ ప్రియా, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :