నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నవంబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి నీది కాదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి ఘాటుగా హెచ్చరించారు. శుక్రవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో రాయల్ గణి విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని మాట్లాడారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మహిళలకు గౌరవిస్తాడని తెలిపారు. తను వివాహం చేసుకున్న మహిళలకు అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందన్నారు. నీ మాదిరిగా మహిళలను ఎప్పుడు మోసం చేయలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. నీ సతీమణికి విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో నువ్వు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. నువ్వు ఒక బలిజ కురుస్తుడే, కానీ తమ నాయకుడిని విమర్శిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. మరోసారి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తే దాడులు చేస్తామని, విమర్శలు చేసే ముందు నీ చరిత్ర ఏమో తెలుసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు వెంకటేష్, చక్రిధర్, రమణ, మహేంద్ర, సదాశివ, ఆదినారాయణ పాల్గొన్నారు.
Reporter
Namitha News