నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 25 : తంబళ్లపల్లె మండల కేంద్రం క్రాస్ రోడ్ ఆర్టిసి బస్సు షెల్టర్ లో బుధవారం మండల డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృశ్య ప్రయాణికులు, ప్రజలు సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు జరిగిందని ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అదేవిధంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, పద్మావతి, భాస్కర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
Reporter
Namitha News