Sunday, 26 July 2026 12:28:03 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రభుత్వాసుపత్రి మహిళా జూనియర్ అసిస్టెంట్ పై మరో జూనియర్ అసిస్టెంట్ విచక్షణ రహిత దాడి

విషయం బయటికి పొక్కకుండా ఆసుపత్రి వర్గాల మంతనాలతో ఆలస్యం గా వెలుగులోకి

Date : 07 May 2026 08:07 PM Views : 254

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 07 : మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళా జూనియర్ అసిస్టెంట్ పై మరో జూనియర్ అసిస్టెంట్ స్కానింగ్ రూమ్ లోనే విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే వ్యక్తి మరో మహిళా జూనియర్ అసిస్టెంట్ పై బుధవారం ఉదయం స్కానింగ్ రూములోనే భౌతిక దాడికి తెగపడ్డాడు. రోగులు, అటెండర్లు ఇతర ఆస్పత్రి సిబ్బంది గమనించి జూనియర్ అసిస్టెంట్ ని కాపాడి అదే ఆసుపత్రిలో చికిత్స అందించారు. సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ గా పని చేసే వారికి రోస్టర్ విధానంలో డ్యూటీలు మారుస్తారు. అయితే అతనికి మాత్రం ఒకే చోట డ్యూటీలు వేస్తుండటంపై ఇతర జూనియర్ అసిస్టెంట్లు అభ్యంతరం తెలిపారు. అయితే ఆ జూనియర్ అసిస్టెంట్లకు గాయపడిన జూనియర్ అసిస్టెంట్ సమాచారం అందిస్తుందన్న సాకుతో సూపరింటెండెంట్ ఛాంబర్ లోని సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి ఆమె స్కానింగ్ రూమ్ లోకి వెళ్ళడం గమనించి నేరుగా స్కానింగ్ రూమ్ కే వచ్చి విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని తెలిసింది. గతంలో కూడా పలుమార్లు సాయి సదరు మహిళపై భౌతిక దాడి చేయడం జరిగిందని బాదితులు తెలిపారు. కేసు పెట్టచ్చు కద అని ప్రశ్నించగా ఎవరూ అండగా లేరని తదనంతరం తిరిగి ఏదైనా చేస్తాడనే భయంతో మిన్నకుండిపోయాం అన్నారు. అతను తన పలుకుబడితో మిగిలిన జూనియర్ అసిస్టెంట్ల రోస్టర్లు కూడా మార్చేస్తున్నాడని సమాచారం అందింది. అయితే బాధితురాలిని భయపెట్టి ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా ఆస్పత్రిలో కొందరు గట్టి ప్రయత్నాలు చెయ్యడంతో బుదవారం జరిగిన దాడి విషయం ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం పై ఆర్ఎంవో డాక్టర్ రాధిక ను వివరణ కోరగా తన దృష్టికి దాడికి సంబందించిన ఎలాంటి ఫిర్యాదు రాలేదని , బాధితురాలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :