Monday, 27 July 2026 09:52:09 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యా నాణ్యతలో మరో మైలురాయి – మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ

మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బి.టెక్ మరియు ఇతర కోర్సు లకు ప్రవేశాలు ప్రారంభం

Date : 01 July 2026 06:36 PM Views : 70

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 01 : మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బి.టెక్ మరియు ఇతర కోర్సు లకు ప్రవేశాలు ప్రారంభం మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుసంధానమైన బోధన, ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలతో మిట్స్ దేశంలో గుర్తింపు పొందిన ప్రముఖ విద్యాసంస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో బీటెక్, ఎం.టెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ మరియు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి అని ఆయన అన్నారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లు, అర్హతకు అనుగుణంగా ఫీజు రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో 5,895 ప్లేస్‌మెంట్ ఆఫర్లు లభించగా, 3,854 మంది విద్యార్థులు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని, ఇటీవల సి.ఎస్.ఈ విద్యార్థిని టి.ఆర్. దీక్ష అమెజాన్‌లో రూ.29.53 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ కు బీటెక్ నందు సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,మెకానికల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్(ఏఐ మరియు రోబోటిక్స్) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఏఐ మరియు డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్(ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) లకు ప్రవేశాలు ప్రారంభం అయ్యాయని ఆయన అన్నారు. ఇతర కోర్సులు బీబీఏ మరియు బీసీఏ లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు (MoUs), ఇంటర్న్‌షిప్‌లు, విదేశీ విద్య అవకాశాలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనకు అనుకూల వాతావరణం మిట్స్ ప్రత్యేకతలని తెలిపారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ మాట్లాడుతూ మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థలలో ఒకటిగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ విద్యా రంగంలో విశిష్ట సేవలను అందిస్తోంది అని, 1998లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం, గత 28 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, ఆవిష్కరణలు మరియు పరిశ్రమల అనుసంధానంతో విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దుతోంది అని అన్నారు. విశ్వవిద్యాలయం స్థాపకులు మరియు ఛాన్సలర్ డా. ఎన్. విజయభాస్కర్ చౌదరి దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వంలో మిట్స్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ విద్యాసంస్థగా ఎదిగింది అని అన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో సుందరమైన ప్రకృతి వాతావరణంలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయం అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు, డిజిటల్ తరగతి గదులు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉందిఅని, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏఐసీటీఈ (AICTE) – అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, న్యూ ఢిల్లీ ఆమోదం, న్యాక్ (NAAC) "A+" గ్రేడ్ గుర్తింపు, జాతీయ అక్రెడిటేషన్ మండలి (ఎన్‌బీఏ) (NBA) గుర్తింపు, యూజిసి2(ఎఫ్) మరియు 12(బి)(UGC 2(f) & 12(B)) గుర్తింపు, యెన్.ఐ ఆర్. ఎఫ్ (NIRF) ర్యాంకింగ్, ఐ ఎస్ ఓ (ISO) 21001:2018 సర్టిఫికేషన్, అలాగే ఏ.ఐ.యూ (AIU) మరియు సి.ఐ.యూ (CIU) సభ్యత్వాలను పొందడం ద్వారా తన విద్యా నాణ్యతను మరింత బలపరుచుకుంది అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానం, అంతర్జాతీయ అవకాశాలు, ఉపాధి దిశగా ప్రత్యేక శిక్షణ అందిస్తూ దేశ విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేలా మిట్స్ నిరంతరం కృషి చేస్తోంది. మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది అని అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా అడ్మిషన్ పోస్టర్ ను యూనివర్సిటీ ప్రాంగణం లో ఆవిష్కారించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పీ రామనాథన్, ప్లేసెమెంట్ ఆఫీసర్ ద్రుపద్ వర్మ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: