నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - డిసెంబర్ 18 : మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో మండల ఆవాజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.. ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు యస్దాని ఆధ్వర్యంలో పలువురు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి బయలుదేరి మున్సిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన అనంతరం మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మైనార్టీ హక్కులపై ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశించి ఆవాజ్ కమిటీ నాయకులు యస్దాని మాట్లాడుతూ 1992 డిసెంబర్ 18వ తేదీన వివిధ మైనారిటీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం మైనార్టీ హక్కుల దినోత్సవం గా ప్రకటించారని అప్పటినుండి ఈరోజుని మైనార్టీ హక్కుల దినోత్సవం గా నిర్వహిస్తున్నామని తెలిపారు.. దేశంలో వివిధ కులాలకు చెందిన మైనార్టీ వర్గీయులు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్న ఏ ప్రభుత్వం కూడా వారి అభివృద్ధికి తోడ్పాటు అందించడం లేదని తెలిపారు... ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు P. మస్తాన్, ఆత్మకూరు ఆవాజ్ మండల కమిటీ సభ్యులు Sd.వాయుదుల్లా, Sd. సలాం Sk. మహబూబ్ బాషా, P. షరీఫ్, G, రజాక్. Sk. అమీర్ భాష, Sk. సందాని. Sk మస్తాన్, Sk అన్వర్ భాష, ఆసిఫ్, Sk రషీద్, Sk మున్నా తదితరులు పాల్గొన్నారు...
Reporter
Namitha News