Sunday, 26 July 2026 07:19:14 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 8 ఎలక్ట్రికల్ ఈ-ఆటోలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్

Date : 12 January 2026 06:16 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : గ్రామాలను పరిశుభ్రంగా చేసి ఉంచడం, ఇంటింటి చెత్త సేకరణను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను పాత అన్నమయ్య జిల్లా ప్రతిపాదన లో భాగంగా చిన్నమండెం మండలం పడమటి కోన పంచాయితీ, ఓబుల్ వారి పల్లి మండలం ఓబులవారిపల్లి పంచాయతీకి, వీరబల్లి మండలం ఓడివీడు పంచాయతీకి, కలికిరి మండలం పాతేగడ పంచాయతీ , అద్దావారిపల్లి పంచాయతీకి, మదనపల్లి మండలం కొత్త ఇండ్లు పంచాయతీ, తంబళ్లపల్లి మండలం పారతోపు పంచాయతీ, సంబేపల్లి మండలం సంబేపల్లి గ్రామ పంచాయతీ, ఈ–ఆటోలను గ్రామ పంచాయతీలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి సంయుక్తంగా పంచాయతీలకు పంపిణీ చేశారు. మొత్తం 8 ఎలక్ట్రికల్ ఈ–ఆటోలను అందజేశారు.ఒక్కో ఈ–ఆటో విలువ రూ. 3,75,000/- కాగా, వీటిని గ్రామీణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ, చెత్త తరలింపు మరియు శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.గ్రామీణ పారిశుధ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రోజువారీ చెత్త సేకరణ తప్పనిసరి అని, ఈ–ఆటోల వినియోగం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. పరిశుభ్రమైన గ్రామాలు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని, ప్రజలు చెత్తను వేరు చేసి అందజేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడి, స్వచ్ఛ గ్రామాలు – ఆరోగ్యకర గ్రామాలు లక్ష్యం సాకారం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ, పంచాయతీ ప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: