నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 29 : రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అదృశ్యం కేసు దర్యాప్తు విషయంలో కొందరు వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, వాస్తవాల వక్రీకరణను పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇది ఫోక్స చట్టం పరిధిలోకి వచ్చే సున్నితమైన అంశం, దర్యాప్తుకు ఆటంకం కలిగించినా, తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని రామసముద్రం పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేశారు. కేసు వివరాలు, నిందితుడి కుటుంబ సభ్యుల వైఖరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 17 సంవత్సరాల మాధవి అనే మైనర్ బాలిక నవంబర్ 15, 2025న మణి అనే వ్యక్తితో వెళ్లిపోయింది. నవంబర్ 17న తల్లి ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 111/2025 కింద కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. అయితే, సంఘటన జరిగిన వెంటనే అనుమానిత వ్యక్తి మణి తల్లిదండ్రులు, సోదరుడు పరారీలోకి వెళ్లిపోయారు. వారు నివాసం మార్చడం, సమాచారం దాచడం వంటి చర్యలతో దర్యాప్తుకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించినా, ఇప్పటివరకు వారు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ప్రేమ జంట గా చిత్రీకరించడం నేరం ఈ మైనర్ బాలిక మిస్సింగ్ కేసును కొంతమంది పెద్దలు ప్రేమ జంట వ్యవహారంగా చూపించడానికి ప్రయత్నించడం పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక అదృశ్యం కేసును ప్రేమ వ్యవహారమని చెప్పడం చట్టపరంగా, నైతికంగా తప్పు. ఇది కేవలం చట్ట అవగాహన లేమి మాత్రమే కాదు, సమాజానికి ప్రమాదకరం, అని పోలీసులు స్పష్టం చేశారు. విచారణను ప్రశ్నించి, బాధితురాలి తల్లికి బాధ కలిగించే వ్యాఖ్యలు చేయడం సరైన పని కాదని హితవు పలికారు. ఫోక్సా నిబంధనలు అందరికీ హెచ్చరించారు.ఇది 18 ఏళ్ల లోపు బాలిక కేసు కాబట్టి ఫోక్స్ ఈ సమావేశంలో యస్.ఐ. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News