Sunday, 26 July 2026 01:33:41 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మల్లయ్య కొండ తవ్వకాలపై వైసీపీ దుష్ప్రచారం_ భక్తుల ప్రజల మనోభావాలు మాకు ముఖ్యం.

భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న టిడిపి ఎమ్మెల్యే లు

Date : 30 June 2026 12:09 AM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి జూన్ 29 : మల్లయ్య కొండ, సాదుకొండ, ఇనుముకొండలలో ఇనుప ఖనిజాల కోసం తవ్వకాలు జరుపుతున్నారని, ప్రభుత్వం ఏదో చేసేస్తోందని తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం తంబళ్లపల్లి మల్లయ్య కొండపై వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష పలువురు ప్రజా ప్రతినిధులు దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లయ్య కొండ అంటే మా ప్రాంత ప్రజలకు పవిత్రమైన దైవ క్షేత్రం. ఇక్కడ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు కావాలని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడటమే వారి పని. అలాంటిది ఏదీ జరగడం లేదు, జరగనివ్వమని స్పష్టం చేశారు.8 గతంలో 2011లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తవ్వకాల కోసం ప్రచారం జరగడంతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుకు విమర్శించే అర్హత మీకు లేదని ఆయన హెచ్చరించారు. జనవరి నెల 22వ తేదీ 2024 సంవత్సరంలో ఎర్ర కొండకు టెండర్లు పిలిచింది వైసీపీ ప్రభుత్వమేనని మళ్లీ ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. భక్తులు,ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, అదే మా కర్తవ్యం. మల్లయ్య కొండ,మల్లికార్జున గుడి మా ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కాపాడటం మా బాధ్యత. ప్రజలు ఎలాంటి అపోహలకు, వైసీపీ రెచ్చగొట్టే మాటలకు లోనుకావొద్దు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొండలను, గుట్టలను కొల్లగొట్టిన వారే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను, దేవుళ్ల మాన్యాలను కంటికి రెప్పలా కాపాడుతుందని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా,రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,రాష్ట్ర బిసి మహిళా అధ్యక్షురాలు పర్వీన్ తాజ్,రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు త్యాగరాజు,ఆర్ జే వెంకటేష్,కట్టదోరస్వామి నాయుడు,కొండ్రేడ్డి అరుమండలాల టీడీపీ మండల అధ్యకులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: