Sunday, 26 July 2026 12:22:30 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్

తంబళ్లపల్లెలో ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం - ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్

Date : 05 June 2026 10:02 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 05 : దశాబ్దాలుగా సాగునీరు తో పాటు తాగునీరు కోసం కటకటలాడిన కరువు ప్రాంతానికి కూటమి ప్రభుత్వం ద్వారా మంజూరైన జల్ జీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి పథకం అందడం తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలకు ఓ వరం లా నిలిచింది.గత నాలుగు మాసాలుగా తంబళ్లపల్లె నియోజకవర్గం లో జల్జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు చొరవతో కాంట్రాక్టర్లను పురమయించి శరవేగంగా జరగడానికి చర్యలు చేపట్టారు. జల్జీవన్ మిషన్ పనులలో భాగంగా శుక్రవారం ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ రషీద్ ఖాన్, డి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలం జుంజురపెంట పంచాయతీ బురుజుపల్లిలో 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులకు ఏ ఈఈ వినోద్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 54 ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరయ్యాయని అందులో తంబళ్లపల్లెకు 90వేల లీటర్లు, ఆర్ ఎం తండా పంచాయతీలో 60 వేల లీటర్లు సామర్థ్యంతో రెండు ట్యాంకులు, మండలంలో 40 వేల లీటర్ల సామర్థ్యంతో నాలుగు ట్యాంకులు, 20వేల సామర్థ్యంతో 33 ట్యాంకులు, 10వేల లీటర్ల సామర్థ్యంతో 15 ట్యాంకులు మొత్తం 54 ట్యాంకులు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులు ఉన్నతాధికారుల సూచనల మేరకు ట్యాంకుల పనులు పారదర్శకంగా వేగవంతంగా, నాణ్యత లోపం లేకుండా నిర్మించి భవిష్యత్తులో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి కృషి చేస్తామన్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికే దక్కినట్లు జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ, మాజీ సర్పంచులు కృష్ణమూర్తి నాయుడు, సిద్ధమల్ రెడ్డి, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్, జగదీష్, జనసేన మండల నాయకుడు ఎద్దుల నరసింహులు, బిజెపి నాయకుడు ఎద్దుల లక్ష్మీపతి లు కొనియాడారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :