Sunday, 26 July 2026 01:33:40 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పెంపుడు కూతురుపై అవాస్త ఆరోపణలు

సొంత కూతురు ఉమాదేవి చేస్తున్న అవాస్తవ ఆరోపణలు

Date : 03 June 2026 08:08 PM Views : 96

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెంపుడు కూతురుపై: కూతురు ఉమాదేవి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: తండ్రి నాగరాజు పుంగనూరు పట్టణంలో బుధవారం మధుశ్రీ అలియాస్ హనీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుశ్రీ మాట్లాడుతూ ఉమాదేవి తనపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ఖండించారు. తాంత్రిక పూజలు చేస్తున్నానని లేనిపోని వేషాలు వేస్తున్నానని అలాగే ఉమాదేవిపై తాను లైంగిక దాడికి పాల్పడ్డానని చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని మధుశ్రీ స్పష్టం చేశారు. ఉమాదేవి కుటుంబంలోని ఆస్తి వ్యవహారాల నేపథ్యంలో తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను నిజంగానే ఉమాదేవిపై లైంగిక దాడికి పాల్పడి ఉంటే డీఎన్‌ఏ పరీక్షలు సహా అవసరమైన అన్ని వైద్య పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని హనీ తెలిపారు. అసత్య ప్రచారాల ద్వారా తన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మధుశ్రీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉమాదేవి తండ్రి నాగరాజు తమ్ముడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ పెంపుడు కూతురు హనీపై ఉమాదేవి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని అన్నారు. కుటుంబ ఆస్తులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే బహిరంగంగా ఆరోపణలు చేయకుండా నేరుగా వచ్చి తమతో చర్చించాలని ఉమాదేవికి వారు కోరారు. కుటుంబ పరమైన విషయాలను అనవసరంగా బయటకు తీసుకువచ్చి వివాదాలు సృష్టించడం సరికాదని ఉమాదేవిని వారు హెచ్చరించారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :