Monday, 27 July 2026 01:52:26 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సిహెచ్సి లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి -డి.సి.హెచ్.ఎస్. లక్ష్మీకర్

Date : 25 May 2026 09:58 PM Views : 69

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని ఇన్ పేషెంట్లు పెరగడానికి కృషి చేయాలని డిసిహెచ్ఎస్ లక్ష్మీకర్ సూచించారు. సోమవారం ఆయన తంబళ్లపల్లి సిహెచ్సీని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులు, బాలింతల వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే యూనిట్, గోపి యూనిట్ పరిశీలించారు. ఆసుపత్రిలో హాజరవుతున్న ఓపి రోగుల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలు, రాత్రిపూట వైద్య నిర్వాహణ, రోగులకు అందిస్తున్న ఉచిత భోజనం సౌకర్యం తదితరాంశాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నా రోగుల సంఖ్య పెరగకపోవడం పై అధ్యయనం చేస్తామని, త్వరలో పోస్టుమార్టం నిర్వహణకు చర్యలు చేపడతామని, చిన్న చిన్న వైద్య సమస్యలపై చీటికిమాటికి మదనపల్లి కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి లోపల ఎక్కడపడితే అక్కడ చెత్త బాక్సులు వేరాదని పారిశుధ్యం పాటించాలని ఆస్పత్రి పరిసరాలు దోమల నివారణతో పరిశుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకర వాతావరణం ఉండాలన్నారు. రాత్రిపూట వచ్చే డెలివరీ కేసులు, యాక్సిడెంట్ కేసులు వైద్యానికి డాక్టర్ కచ్చితంగా ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. ఆసుపత్రిలో డెలివరీలు పెంపుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి లో అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించినట్లు తెలిపారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ తేజస్వి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :