నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 25 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో గురువారం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జన్మదిన వేడుకలు బిజెపి, కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా క్రాస్ రోడ్లో బిజెపి జెండా ఆవిష్కరించి వాజ్ పాయ్ చిత్ర పటానికి పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రమణ, మాజీ అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి,మగ్గాల లక్ష్మయ్య, సుబ్బయ్య,అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి,కొటాల మల్లికార్జున, యుగంధర్,టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, పురుషోత్తం,యువగళం మనిగే బాలాజీ,నరసింహులు, సుధాకర్ రెడ్డి,వీరాంజనేయులు, పీర్లమాబు, పాల్గొన్నారు.
Reporter
Namitha News