నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 ః కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని తంబళ్లపల్లె ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి హెచ్చరించారు. సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు డీజిల్, పెట్రోల్ పెంపుకు నిరసనగా వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి బిరుస్తోందని, ఉన్నపలంగా ఆయిల్ ధరలు పెంచడంపై వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డీజిల్ పెట్రోల్ ధరలకు తోడుగా గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్య ప్రజలపై భారం మోపడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలు వినతి పత్రాన్ని తాసిల్దారు శ్రీనివాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ,మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కరీం, ఎంపీటీసీ కరిముల్లా, బాలకృష్ణారెడ్డి, రామ్మూర్తి, సలీం, రమేష్, మాజీ సర్పంచులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News