నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 20 ః తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ దండువారి పల్లెలో గురువారం జరిగిన ఉచిత పశువైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. ఉదయం పశు వైద్య శిబిరం తంబళ్లపల్లె ఏడి డాక్టర్ సుమిత్ర ప్రారంభించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 36 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు, 95 పశువులకు బూటాక్స్ పిచికారి, 46 దూడలకు నట్టల నివారణ మందు పశువైద్య నిపుణులు సహాయ సంచాలకులు డాక్టర్ కళ్యాణ్ వెంకటేష్, డాక్టర్ ఇందులు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భ కోశ వ్యాధుల పట్ల రైతులకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో జేవిఓలు శ్రీనాథ్, హేమాపతి రెడ్డి, పశు వైద్య సహాయకులు శ్రీనివాసరెడ్డి, శిరీష, దేవేంద్ర, పూర్ణిమ,రమేష్, నాగార్జున పాడి రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News