Sunday, 26 July 2026 07:38:25 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కెరీర్స్ 360 ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్–2026లో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి “AAAA” రేటింగ్

Date : 14 June 2026 07:22 PM Views : 71

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 14: మదనపల్లి పట్టణం అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కెరీర్స్360 ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్–2026 లో దేశంలోని ఉత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల జాబితాలో స్థానం సంపాదించి “AAAA” రేటింగ్ను పొందినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన మరియు ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానం, విద్యార్థుల ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నైపుణ్యం వంటి పలు ప్రమాణాల ఆధారంగా నిర్వహించిన సమగ్ర మూల్యాంకనంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం విద్యా నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలు మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తోందన్నారు. కెరీర్స్360 అందించిన ఈ రేటింగ్ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు మరియు అత్యుత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాల ద్వారా విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తోందన్నారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ లు అభినందనలు తెలిపారు. అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ & రీసెర్చ్, ఇండస్ట్రీ కనెక్ట్, ప్లేస్‌మెంట్ సక్సెస్ రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ఈ గుర్తింపు లభించడం పై హర్షం వ్యక్తం చేసారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :