Sunday, 26 July 2026 04:38:47 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా

ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తా - మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్

Date : 16 June 2026 10:37 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె- జూన్ 16 :: తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీని ఒక్కతాటిపై నిలిపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని, ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ భావోద్వేగంతో వ్యక్తంచేశారు. మంగళవారం బి.కొత్తకోటలో టిడిపి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా అరాచక పాలనతో టిడిపి నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలు, అక్రమ కేసులతో పాటు అన్ని రకాలుగా నష్టపోయారని వారిని ఆదుకునే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు అధికారం ఉండి నేటికి టిడిపి నాయకులు పడుతున్న కష్ట నష్టాలను కళ్ళారా చూశానని పార్టీ కోసం ధైర్యంగా నిలబడి నిలిచిన మీకోసం ఏ త్యాగానికైనా సిద్ధమని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన తంబళ్లపల్లె ను గత ఎన్నికల్లో కోల్పోవడం బాధాకరమని ఎన్ని కష్టాలు వచ్చినా టిడిపి క్యాడర్ చెక్కుచెదరలేదని అలాంటి కార్యకర్తల కోసం అండగా నిలబడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని తంబళ్లపల్లె నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాబోయే మంచి రోజులకు ప్రతి టిడిపి కుటుంబ సభ్యుడు ముందుకు రావాలని ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినీతి వైకాపాకు గుణపాఠం నేర్పాలన్నారు. సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ అండగా నిలబడి పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తారని నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో ఆయనకు పూర్తి సహకారం అందించాలన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లె కు కూటమి పాలనలో హంద్రీనీవా జలాలతో రైతులు, రోడ్లు, అభివృద్ధి పనులు పూర్తి కావడం ఖాయం అన్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ బి కొత్తకోటలో వందలాదిగా టిడిపి నాయకులు కార్యకర్తలు పూలమాలలు, దుశ్యాలువులతో ఘనంగా సత్కరించి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జి శంకర్ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్, నియోజకవర్గంలోని 6 మండలాల టిడిపి మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ కమిటీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వందలాదిగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: